‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో నటించిన ఆ బుడ్డోడు..ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే!

-

విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఇష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేమ్ టైమ్ లో సెంటిమెంట్, కామెడీ పంచగల నటుడిగా వెంకటేశ్ కు చక్కటి పేరు ఉంది. ఆయన నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పిక్చర్ ఘన విజయం సాధించింది. ఇందులో వెంకీకి జోడీగా సౌందర్యతో పాటు వినీత నటించింది.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో వెంకటేశ్ కొడుకుగా బుడ్డోడి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇఫ్పటికీ టీవీల్లో ఈ ఫిల్మ్ వస్తే చాలు..జనాలు టీవీలకు అతుక్కుపోతారు. నేపాల్ కు చెందిన మనీషాను వెంకటేశ్ పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఆమె గర్భవతి కావడం ..ఇండియాకు రావడం వంటి ట్విస్టులు సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఈ ఫిల్మ్ లో వెంకటేశ్ – సౌందర్య దంపతులు ..మనీషా కుమారుడైన బుడ్డోడిని దత్తత తీసుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఇక ఇంట్లో బుడ్డోడితో ఉండే కామెడీ సీన్స్ చాలా హైలైట్ గా ఉంటాయి. ఆ బుడ్డోడు నాగ అన్వేష్..కాగా, ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం.

చిత్రంలో చక్కటి మాటలతో నాగ అన్వేష్ ‘తలలో మల్లెపూలు పెట్టాలి’ అనే డైలాగ్ చెప్తూ వెంకటేశ్ ను ఇరిటేట్ చేస్తుంటాడు. అలా నాగ అన్వేష్ అందరికి నచ్చేశాడు. ప్రజెంట్ ఆ బుడ్డోడు పెద్దోడు అయిపోయి టాలీవుడ్ యంగ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘వినవయ్యా రామయ్యా’, ‘ఏంజెల్’ చిత్రాలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news