వింత వింత రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ని మించిన వారు లేరనే చెప్పాలి. అసలు ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకొస్తారో…ఏ విధమైన వ్యూహాలని అమలు చేస్తారో ఎవరికి క్లారిటీ ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కొన్ని రోజులు బయటకు కనబడరు..కానీ కొన్ని రోజులు బాగా సడన్ గా బయటకొచ్చి…సరికొత్త రాజకీయాన్ని నడుపుతారు. ఇంతకాలం పెద్దగా బయట కనబడని కేసీఆర్..ఇటీవల రాష్ట్రంలో బీజేపీ సభ భారీ సక్సెస్ అయ్యాక…కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి దేశ రాజకీయాలని మాట్లాడుకుంటూ వచ్చారు. టోటల్ గా బీజేపీని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు.
ఇక ఇప్పటివరకు పెద్దగా ప్రజల్లో తిరగని కేసీఆర్…తాజాగా గోదావరి వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. సరే వెళ్ళక వెళ్ళక చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి వెళ్లారు. వారి బాధలని తెలుసుకునే ప్రయత్నం చేస్తారని అంతా అనుకున్నారు. అయితే కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు..అలాగే వారికి అండగా ఉంటామని భరోసా కూడా ఇస్తూ వచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది…కానీ ఉన్నట్టు ఉండి హఠాత్తుగా కొత్త టాపిక్ ని తీసుకొచ్చారు.
గోదావరికి వరదలు రావడం వెనుక విదేశీ కుట్ర ఉందని బాంబు పేల్చారు. గోదావరి వరదలను చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందని, గతంలో లద్దాక్‌లో, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి వరదలే చోటుచేసుకున్నాయని తెలిపారు. అసలు ఈ ఆలోచన దేశంలో ఎవరికి రాలేదు…కానీ కేసీఆర్ కు మాత్రమే వచ్చింది. మరి ఆయన ఏమైనా ఆధారాలు ఉండి మాట్లాడారా? లేక పోలిటికల్ డైవర్షన్ కోసం మాట్లాడరా? అనేది ఎవరికి క్లారిటీ లేదు.
అయితే దీనిపై నిపుణులు వేరేగా స్పందిస్తున్నారు…ఈ స్థాయిలో క్లౌడ్ బరస్ట్ జరగడానికి అవకాశాలు లేవని అంటున్నారు. అయిన క్లౌడ్ బరస్ట్ చేస్తుంటే మన ర్యాడర్ కు అందకుండా ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి క్లౌడ్ బరస్ట్ అనే కాన్సెప్ట్ కేసీఆర్ తీసుకొచ్చిందే అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ప్రజా సమస్యలని పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి.
కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఏం మాట్లాడితే దానిపైనే చర్చ జరుగుతుంది…ఇప్పుడు అదే జరుగుతుంది…ఇప్పుడు అందరూ క్లౌడ్ బరస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు…అసలు అది ఏంటి అని చర్చించుకుంటున్నారు. అంటే వరదలు, వరదల వల్ల జరిగిన నష్టం, ఇతర సమస్యలు పూర్తిగా డైవర్ట్ అయినట్లు కనిపిస్తున్నాయి. అంటే వరదలపై ప్రతిపక్షాలు…టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడకుండా కేసీఆర్ ఇలా కొత్త కథలు చెబుతున్నారనే వాదనలు వస్తున్నాయి. ఏదేమైనా వింత రాజకీయాలు చేయాలంటే కేసీఆర్ తర్వాతే ఎవరైనా…మరి ఈ క్లౌడ్ రాజకీయం ఎంతవరకు నడుస్తుందో చూడాలి.