ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌..

-

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీలోని ఉపాధ్యాయులపై ఫైర్‌అయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ అవసరం లేదంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు?” అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విద్యా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను తప్పుపట్టే హక్కు ఉపాధ్యాయులకు లేదని పేర్కొన్నారు మంత్రి బొత్స. ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భాగమని.. అందువల్ల ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు మంత్రి బొత్స.

Andhra Pradesh: Capital shifting at any moment, stresses Botsa Satyanarayana

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకే సంస్కరణలు అమలు చేస్తున్నామని.. వీటి ఫలితాలు వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని అన్నారు మంత్రి బొత్స. సీబీఎస్ఈ సిలబస్ అమలు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌ల వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు మంత్రి బొత్స. పాఠశాలల విలీనం విషయంపై విద్యార్థుల తల్లితండ్రులు ఎక్కడా అభ్యంతరం చెప్పడం లేదని.. ఎవరో కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స.

 

Read more RELATED
Recommended to you

Latest news