రిస్క్ పెంచుతున్న ఎమ్మెల్యేలు..ప్లస్ పోతుందా?

-

వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు రిస్క్ పెంచుతున్నారా? ఉన్న ప్లస్ అని కూడా వారే పోగొడతారా? అంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలని బట్టి చూస్తే…అది కాస్త నిజమే అనిపిస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో పూర్తిగా జగన్ గాలి వల్లే…వైసీపీ తరుపున అంతమంది ఎమ్మెల్యేలు గెలవగలిగారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ ఎమ్మెల్యేలే జగన్ ఇమేజ్ ని తగ్గించుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తున్నారు. సరైన పనితీరు కనబర్చకపోవడం…రాను రాను ఎమ్మెల్యేలకు ప్రజా మద్ధతు తగ్గిపోతుండటం వైసీపీకి మైనస్ అవుతుంది.

వాస్తవానికి ఇప్పటికీ జనంలో జగన్ బలం తగ్గలేదు. కానీ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారి పనితీరుపై ఎక్కడకక్కడ ఫైర్ అవుతున్నారు. సమస్యలని పట్టించుకోకుండా ఉంటున్న ఎమ్మెల్యేలని ప్రజలే నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. గడప గడపకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి ఎంత ఎక్కువ వెళితే…అంతగా ప్లస్ ఉంటుందని జగన్ నమ్ముతున్నారు.

అందుకే ఇటీవల కూడా ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువగా ప్రజల్లో ఉండాలని అన్నారు. నిజానికి తన గ్రాఫ్ బాగుందని, కానీ కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని, దాని వల్ల పార్టీకే మైనస్ అని, అందరి గ్రాఫ్ బాగుంటేనే…పార్టీ బాగుంటుందని, మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని జగన్ చెబుతూనే ఉన్నారు. గతం కంటే ఈ సారి ఇంకా ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారు.

కానీ అందుకు తగ్గట్టు ఎమ్మెల్యేల పనితీరు ఉండటం లేదు…జగన్ క్లాస్ తీసుకున్న సరే కొందరు ఎమ్మెల్యేల పనితీరులో పెద్దగా మార్పు వస్తున్నట్లు కనిపించడం లేదు…పూర్తి స్థాయిలో వారు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫమవుతుండటంతో ప్రజలు, ఎమ్మెల్యేలపై తిరగబడే పరిస్తితి ఉంది. మొత్తానికైతే ఎమ్మెల్యేల వల్ల జగన్ రిస్క్ లో పడేలా ఉన్నారు..ఆ రిస్క్ ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది…లేదంటే ఉన్న పాజిటివ్ పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news