అనుకున్న దాని కంటే మునుగోడులో బీజేపీ సభ భారీగా సక్సెస్ అయిందని చెప్పాలి. అసలు బలం లేని చోట బీజేపీ సభ సక్సెస్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ డౌట్ ఉంది. పైగా అధికార టీఆర్ఎస్ సభని సక్సెస్ కాకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చింది. కానీ అవేమీ పెద్దగా ఫలిచలేదు. మునుగోడులో బీజేపీ సూపర్ సక్సెస్ అయింది..ఊహించిన దాని కంటే ఎక్కువగానే జనం వచ్చారు.
జనాలని చూసి అమిత్ షా కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీజేపీలో దక్షిణ తెలంగాణ నుంచి రాజగోపాల్‌రెడ్డి చేరడం, స్థానికంగా ఏమాత్రం పట్టులేని బీజేపీకి మునుగోడులో మొదటి సభకు భారీగా జనాన్ని తరలిరావడం బీజేపీకి కలిసొచ్చే అంశం. వేదిక నలుమూలలా జనం కనిపించడంతో వేదికపైకి వస్తూనే అమిత్‌షా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సభ సక్సెస్ కావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది….మునుగోడులో గెలవాలనే కసి వారిలో ఉంది.
అయితే సభ అయిపోయాక…అమిత్ షా…బీజేపీ నేతలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది..మునుగోడులో గెలుపుపై పలు వ్యూహాలు వివరించినట్లు సమాచారం. ఈ సభ తర్వాత మరింత ఎక్కువగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలని లాగడమే బీజేపీ మెయిన్ టార్గెట్ గా ఉంది. వారిని ఎంత లాగితే అంత ఎక్కువగా బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయి.
కోమటిరెడ్డి బలం…టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలే మునుగోడులో బీజేపీని గెలుపు దిశగా తీసుకు వెళ్లనున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఓటింగ్ ఎంత తగ్గిస్తే అంత బీజేపీకి బెటర్. కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు లాగితే అది టీఆర్ఎస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. ఓట్ల చీలిక కలిసొస్తుంది. అంటే ప్రధాన టార్గెట్ కాంగ్రెస్ ఓట్లు లాగడం…అలా చేయకపోతే బీజేపీకి రిస్క్ ఎక్కువ. హుజూరాబాద్ లో అదే జరిగింది..కాంగ్రెస్ ఓట్లు తగ్గడం బీజేపీకి కలిసొచ్చింది. కాబట్టి మునుగోడులో బీజేపీ టార్గెట్…కాంగ్రెస్ పార్టీని ఇంకా వీక్ చేయడం.
మునోగోడు ‘జన ప్రవాహం’….
పోటెత్తిన కాషాయ సంద్రం 🌊“I bow to the people of Telangana for such a massive turnout in today’s public meeting at Munugode (Nalgonda).”
— Shri @AmitShah Ji pic.twitter.com/oZN25J5JRm
— Tanmay Sutradhar 🇮🇳 (@thetanmay_) August 22, 2022