కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించిన సినిమాలివే..

-

టాలీవుడ్ సీనియర్ హీరో, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3.25 గంటలకు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు నటవారసుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ పెళ్లి బాధ్యత తనదేనని గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో కృష్ణంరాజు చెప్పారు. కాగా, ఆ బాధ్యత నెరవేర్చకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకుని ఆయన, ప్రభాస్ అభిమానులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరూ కలిసి ‘రెబల్’ సినిమాలో నటించారు. ఇందులో తండ్రీ కొడుకులుగా నటించారు. నిజ జీవితంలో ప్రభాస్ కు కృష్ణంరాజు పెదనాన్న కాగా ఈ పిక్చర్ లో తండ్రిగా నటించారు. లారెన్స్ రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉండగా, బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఇటీవల విడుదలైన‘రాధేశ్యామ్’ పిక్చర్ లోనూ ప్రభాస్ గురువుగా కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాపైన కూడా భారీ అంచనాలుండగా, బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. లవ్ స్టోరిగా వచ్చిన ఈ మూవీ చూసి అభిమానులు నిరాశ చెందారు. ప్రభాస్ ను యాక్షన్ స్టార్ గా చూసిన తాము లవ్ స్టోరి లో చూడలేకపోయామని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news