BREAKING : సిత్రంగ్ తుఫాను అలర్ట్‌.. ఏపీ తీరప్రాంతాలకు భారీ ముప్పు

-

బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈనెల 22కి అల్పపీడనంగా, 23 నాటికి తుఫానుగా మారి తీరానని దాటుతుందని తెలిపింది వాతావరణ శాఖ. దీని కారణంగా ఒడిశా, బెంగాల్ తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలకు భారీ వర్షం ముప్పు ఉంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న తుఫాను ప్రసరణ, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నప్పటికీ దాని తీవ్రత, మార్గంపై అంచనా వేయడం కష్టంగా ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మ్రుతుంజయ్ మహపాత్ర తెలిపారు.

Cyclone Sitrang: Tropical Cyclone Likely to Form Over Bay of Bengal, Leaves  of Government Employees Cancelled in Odisha From October 23 to 25 | 📰  LatestLY

పలు కోస్తా జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించారు. సూచనను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం తమ ఉద్యోగుల సెలవులను అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 25 వరకు రద్దు చేసింది. సిత్రంగ్ కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తుఫాను మొదలైతే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే.. సిత్రంగ్‌ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news