Breaking : ఎలాన్ మస్క్ కు రాహుల్‌ అభినందనలు.. ఫిర్యాదు కూడా

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది. ఈ డీల్‌తో ప్రపంచంలోనే అతి పెద్దదైన సోషల్ మీడియా చర్చా వేదిక మస్క్ చేతికి చిక్కినట్టు అయింది. అయితే.. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగానే ఆయన మస్క్ కు గ్రీటింగ్స్ తెలిపారు రాహుల్ గాంధీ. గ్రీటింగ్స్ తో పాటు ట్విట్టర్ కొత్త అధినేతగా మారిన మస్క్ కు రాహుల్ గాంధీ ఓ ఫిర్యాదు కూడా చేశారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ ఒత్తిడితో విపక్షాల గొంతు నొక్కే సంప్రదాయానికి ట్విట్టర్ ఇకనైనా తెర దించుతుందని భావిస్తున్నానని రాహుల్ అన్నారు. విద్వేష ప్రసంగాలను అడ్డుకోవడంతో పాటుగా నిజ నిర్ధారణ మరింత పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు రాహుల్ గాంధీ.

Bharat Jodo Yatra: Rahul Gandhi to wind up K'taka leg today and enter  Telangana | Mint

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన ఓ గ్రాఫ్ ను ఎలాన్ మస్క్ కు పంపిన ట్వీట్ కు రాహుల్ గాంధీ జత చేశారు. ఈ గ్రాఫ్ లో రాహుల్ గాంధీ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే కొంత కాలం పాటు రాహుల్ ఖాతాకు కొత్తగా వచ్చిన ఫాలోయర్లను ట్విట్టర్ తిరస్కరించింది. ఫలితంగా కొంతకాలం పాటు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆ తర్వాత తిరిగి రాహుల్ గాంధీ ఫాలోయర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇదే గ్రాఫ్ ను తన ట్వీట్ కు జత చేసిన రాహుల్… ప్రభుత్వ ఒత్తిడి వల్లనే తన ఫాలోయర్లను ట్విట్టర్ అనుమతించకపోయి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news