శభాష్‌ త్రిష.. టీమిండియా అండర్-19 ఎంపికైన తెలంగాణ ఆడబిడ్డ

-

అండర్-19 క్రికెట్ జట్టుకు తెలంగాణ బిడ్డ త్రిష ఎంపికైంది. భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు కూడా చోటు కల్పించారు. త్రిష ఎనిమిదేళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడింది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది.

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

అంతేకాదు, త్రిష 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిష ప్రధానంగా లెగ్ స్పిన్నర్. అయితే బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరిట ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news