Breaking : క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో తొలి టెన్నిస్‌ అకాడమీ

-

గుంటూరులోని బీఆర్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి కోచింగ్ సామర్థ్యంతో రాష్ట్రంలోనే తొలి టెన్నిస్ అకాడమీని శాప్ ఏర్పాటు చేసింది. దీన్ని నేడు ప్రారంభించనుంది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఉండేలా ఆధునిక వసతులు అకాడమీలో ఉన్నాయి. గ్రామస్థాయి క్రీడాకారులు తక్కువ ఖర్చుతో శిక్షణ పొందేలా ప్రణాళిక రూపొందించింది. ఇక్కడ 2 సింథటిక్ కోర్టులుండగా, మరో 4 క్లే కోర్టులను తయారుచేస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది.

 

The Official Home of the Women's Tennis Association | WTA Tennis

ఈ సమావేశంలో మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ (SIPB) గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news