జోరందుకున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు

-

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్లు సమర్పించేందుకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లను వచ్చే నెల మొదటి వారంలో నియమించుకుంటామని ప్రకటించారు. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్ సరిదిద్దడం, స్టేషన్ల స్థానాలను నిర్ణయించేందుకు సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు.

శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS), ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ పద్ధతుల ద్వారా సర్వే పనులు శరవేగంగా జరుపుతున్నట్లు చెప్పారు. శంషాబాద్ కు సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తైందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తువుతుందని, ఆ తర్వాత అలైన్ మెంట్ మార్కింగ్ ప్రారంభిస్తామన్నారు. స్టేషన్ స్థానాలను గుర్తించడానికి ఢిల్లీ మెట్రో వారు తయారు చేసిన DPR, సాధారణ రైల్వే ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news