కూరగాయాల్లో చాలా తక్కువమంది వాడేది.. గుమ్మడికాయ.. దీన్ని దిష్టితీయడానికి తప్ప తింటానికి పనికిరాదనుకునే మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు.. కానీ తెల్లగుమ్మడి కాయతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..? మీరు కానీ ఈ ప్రయోజనాలను తెలుసుకుంటే కచ్చితంగా తెల్లగుమ్మడికాయను ఈసారి మార్కెట్లో కొనేస్తారు..!!
తెల్ల గుమ్మడికాయ ప్రయోజనాలు..
తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. రకరకాల పోషకాలు అంది.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రావు.
తెల్ల గుమ్మడికాయలో విటమిన్ A, B6, C, E, కెరోటిన్, ల్యూటిన్, జీలాంథిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫొలేట్, నియాసిన్, థియామైన్ ఉంటాయి.
అధిక బరువు పెరగడానికీ, గుండె జబ్బులు రావడానికీ కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ని తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. కారణం వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి.
మనకు టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే.. L ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. దీన్ని శరీరం ఉత్పత్తి చెయ్యలేదు. కానీ తెల్ల గుమ్మడిలో ఇది ఉంటుంది. కాబట్టి.. టెన్షన్ పడేవారు తెల్ల గుమ్మడి వాడటం మేలు.
విటమిన్ A, ల్యూటెయిన్, జీలాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్స్.. తెల్ల గుమ్మడికాయలో ఉంటాయి. ఇవి కళ్లను అన్ని రకాలుగా కాపాడగలవు. కాటరాక్ట్స్ సమస్యను తగ్గించగలవు.
కీళ్లనొప్పులు ఉండేవారు తెల్ల గుమ్మడికాయని వండుకొని తింటే మంచి ఉపశమనం లభిస్తుంది…ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలు కూడా తినాలి. అవి కూడా బాగా పనిచేస్తాయి.
ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మక్రిములు, ఇతర విష వ్యర్థాలను తెల్ల గుమ్మడికాయలు తరిమేస్తాయి. ఆస్తమా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడి కాయను కూరల్లో వాడితే…మంచి ఫలితం కనిపిస్తుంది.
తెల్ల గుమ్మడిలో థెరప్యూటిక్ గుణాలుంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది. అల్సర్లు తగ్గుతాయి. అజీర్తి పోతుంది.
ప్రొస్టేట్ (వీర్యగ్రంథి) క్యాన్సర్ని తగ్గించడంలో గుమ్మడి కాయ గింజలు బాగా పనిచేస్తున్నాయి. తెల్ల గుమ్మడి, గింజల్లో ఉండే కెరోటెనాయిడ్స్, జింక్.. ప్రొస్టేట్ క్యాన్సర్ని అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది.