ఈ బడ్జెట్ పై తమకు పలు సందేహాలు ఉన్నాయి: భట్టి విక్రమార్క

-

బడ్జెట్ సమావేశాలలో భాగంగా బుధవారం ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉందని అన్నారు . అయితే, ఈ బడ్జెట్ పై తమకు పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించారు. ఆదాయ అంచనాలు వాస్తవదూరంగా ఉన్నాయని అన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ లెక్కలను పరిశీలిస్తే.. గతేడాది కన్నా ఈ ఏడాది రూ.40 వేల కోట్లు ఎక్కువగా చూపించారని భట్టి వ్యక్తపరిచారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో చదువుకుంటున్న పేద విద్యార్థులు రాష్ట్రానికి ఆస్తి అని విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. డబ్బుకు వాళ్లు పేద వారే కానీ మేధస్సులో అపార సంపన్నులని అన్నారు . రేపు దేశానికి ఎంతగానో ఉపయోగపడతారని, అలాంటి విద్యార్థులకు మెస్ బిల్లు రూ.3 వేలు వస్తే మనం రూ.1,500 ఇస్తున్నామని చెప్పారు.

వారికి నెలకు రూ. 3వేలు ఇవ్వలేమా? అని ప్రభుత్వాన్ని భట్టి నిలదీశారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో వారికి రూ.3 వేలు ఇచ్చేందుకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రాష్ట్రంలో కొత్తగా పన్నులు విధించబోతున్నారా.. ఇప్పటికే విధిస్తున్న పన్నులు పెంచబోతున్నారా.. ప్రభుత్వం ఏంచేయబోతోందని ప్రశ్నించారు. కొత్త పన్నులు విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేకుంటే ఈ 40 వేల కోట్లు బడ్జెట్ లో చూపించడం ఆశ్చర్యకరమేనని వ్యక్తపరిచారు విక్రమార్క.

 

 

Read more RELATED
Recommended to you

Latest news