గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియామకాల్లో మారిన రూల్స్..

-

ఏపీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్స్ ను తీసుకువస్తుంది.. ఇప్పటికే విద్యావ్యవస్థకు సంబంధించి ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా గ్రూప్స్ కు సంబందించిన ఉద్యోగాల నియామకాల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది..గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల్లో కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది. ఈ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఇక నుంచి తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ టెస్టును ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తుందని తెలిపింది. ఈ సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ కూడా గ్రూప్ 2, గ్రూప్3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్‌హక్ నిబంధనలు జారీ అయ్యాయి. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం, ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది..ఇది తప్పనిసరి..

డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై పరీక్షలను రాయాల్సి ఉండటం మంచిది.ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు.. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు… బీసీలు 35.. ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్‌కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఫలితంగా ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెరగనుంది. తద్వారా ఉద్యోగాల భర్తీలో ఆయా వర్గాలకు మేలు జరగనుంది

Read more RELATED
Recommended to you

Latest news