వైసీపీని ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచిందా? మండలి రద్దు ఎఫెక్ట్ ఉందా?

-

వరుస విజయాలతో ఊపు మీద ఉన్న అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో వైసీపీ ఓడిపోయింది. ఇలా ఓటమి పాలైన సరే..అవి పెద్ద లెక్కలో తీసుకున్నట్లు కనిపించడం లేదు. తమకు ప్రజల మద్ధతు ఉందని ఇంకా వైసీపీ నేతలు చెబుతున్నారు.

వాస్తవానికి ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒక కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఎన్నికలైన వార్ వన్ సైడ్ అన్నట్లు వైసీపీ గెలుస్తూ వచ్చింది..ప్రతిపక్ష టి‌డి‌పిని చావుదెబ్బతీస్తూ..తమ అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. దాదాపు 90 శాతం పైనే విజయాలు నమోదు చేసింది. ఇక తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో గెలిచింది.

ఆఖరికి చంద్రబాబు సొంత స్థానం కుప్పంలో కూడా అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. దీంతో ఇంకా నెక్స్ట్ కుప్పం కూడా కొడుతున్నామని..వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టుకుని ముందుకెళుతున్నారు. అయితే ఇక్కడే వైసీపీ ఆత్మ విశ్వాసం ఎక్కువైనట్లు కనిపిస్తుంది. టీడీపీని అణిచివేశామని, ఇంకా చంద్రబాబు పని అయిపోయిందని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ ధీమాగా ఉండిపోయింది.

కానీ పట్టభద్రులు వైసీపీకి షాక్ ఇచ్చారు..ఇక ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. అయినా సరే టి‌డి‌పి విజయాలని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్తితి కొనసాగితే వైసీపీకే రిస్క్. ఓటమిపై ఎప్పుడు విశ్లేషణలు ముఖ్యం..ఓటములని తక్కువ చేసి చూసుకుంటే మునిగేది వైసీపీనే. పైగా ఎమ్మెల్సీల్లో మండలి రద్దు అనేది కూడా వైసీపీని ఇబ్బంది పెట్టినట్లు కనిపిస్తుంది.

మొన్నటివరకు మండలిలో టి‌డి‌పిదే ఆధిక్యం…వారికి ఆధిక్యం ఉందని చెప్పి జగన్ మండలి రద్దు వైపుకు వెళ్లారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి..కేంద్రానికి పంపారు. కానీ ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యేలు పెరుగుతున్నారో అప్పటినుంచి మండలి రద్దు అంశం కనబడలేదు. పట్టభద్రుల ఎన్నికల్లో టి‌డి‌పికి ఇదే ప్రధాన అస్త్రం అయింది..మండలి రద్దు చేస్తానన్న వైసీపీకి ఎమ్మెల్సీలు ఎందుకు అని ప్రచారం చేశారు. చివరికి వైసీపీకే దెబ్బతగిలింది. మొత్తానికి వైసీపీకి అన్నీ రివర్స్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news