కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి : మంత్రి ఎర్రబెల్లి

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కంటి వెలుగు. ఇటీవల ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ ఎంతో ఘనంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే.. దృష్టి లోపం ఉన్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకుని దృష్టి లోప సమస్యలు పరిష్కరించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. సోమవారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి వారికి కళ్లద్దాలతో పాటు అవసరమైతే శస్త్ర చికిత్స కూడా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని అన్నారు.

Warangal: The other side of Errabelli Dayakar Rao

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ భువనగిరి ఎల్లయ్య నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, మూనావత్ నరసింహ నాయక్, మండల శ్రీధర్, కుక్కడబు జయశ్రీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news