ఏపీలో మళ్ళీ ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైంది..జగన్ షెడ్యూల్ కంటే ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మళ్ళీ ప్రచారం మొదలైంది. ఇప్పటికే పలుమార్లు టిడిపి అధినేత చంద్రబాబు..ముందస్తు ఎన్నికలపై పలుమార్లు మాట్లాడుతూ వచ్చారు. రెండేళ్ల నుంచి ఆయన ముందస్తు అని మాట్లాడుతున్నారు. జగన్ పై వ్యతిరేకత పెరిగిపోయిందని, అందుకే పూర్తిగా వ్యతిరేకత పెరగక ముందే ముందస్తుకు వెళ్ళే ప్లాన్ చేస్తారని అంటున్నారు.
ముందస్తుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బాబు..టిడిపి నాయకులని కార్యకర్తలని యాక్టివ్ గా ఉంచుతున్నారు. కానీ ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని, పూర్తిగా పాలన చేస్తామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయినా సరే ముందస్తుపై ప్రచారం ఆగడం లేదు. ఇదే సమయంలో తాజాగా జగన్ మళ్ళీ ఢిల్లీకి వెళ్లారు..నెలలోపు ఇది రెండోసారి ఢిల్లీకి వెళ్ళడం..రాష్ట్ర ప్రయోజనాల కోసం కంటే సొంత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీకి వెళుతున్నారనే విమరసలు వస్తున్నాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో అవి నాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేందుకు మోదీని, అమిత్ షాని కలుస్తున్నారని టిడిపి విమర్శలు చేస్తుంది. ఇక తాజాగా ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జగన్..బిజేపికి సహకరించేలా ఒప్పందం చేసుకున్నారని, అలాగే ఈ ఏడాది చివరిలో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయని, వాటితో పాటే ఏపీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేయాలని జగన్..మోదీని కోరినట్లు కథనాలు వస్తున్నాయి.
అంటే పూర్తి వ్యతిరేకత పెరగక ముందే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ జగన్ నిజంగా ఆ ఆలోచన చేస్తున్నారనేది క్లారిటీ లేదు. వైసీపీ వర్గాల్లో ముందస్తుపై చర్చ లేదు. కాబట్టి ఏపీలో ముందస్తుపై ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. ముందు అంచనా వేసుకున్న ఉపయోగం లేదు. కానీ ఎటు చూసుకున్న ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి..ఇప్పటి నుంచే పార్టీలు ప్రజల్లో ఉండటం మొదలుపెట్టనున్నాయి.