నర్సరీ ఫొటోలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు విషయంలోకి వెళ్లితే…. ఇవాళ కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. నర్సరీ ఫొటోలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో శనివారం రాత్రి పోస్ట్ చేశారు. ఈ అందమైన ఫొటోలు ఎక్కడ నుంచి వచ్చాయో ఊహించండి? అంటూ నెటిజన్లను ప్రశ్నించిన ఆయన.. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీలు అంటూ వివరించారు.
కోరుట్ల నర్సరీ లాగే రాష్ట్ర పురపాలక పట్టాభివృద్ధిశాఖ శాఖ తెలంగాణలోని 141 పట్టణాల్లో 1,012 నర్సరీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరో 600 నర్సరీలు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోరుట్ల మున్సిపల్ కమిషన్‌ను అభినందించారు. మంచి పనిని కొనసాగించాలంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Guess where these beautiful pics are from?
Nursery maintained by Korutla Municipality !! 😊
We have 1012 such Nurseries across 141 Towns (plus another 600 in GHMC) @MC_Korutla Great Job 👏 Keep up the good work @cdmatelangana #HaritaHaaram #GreenBudget pic.twitter.com/DtG05iTUmp
— KTR (@KTRBRS) April 1, 2023