ఖమ్మంలో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు..ఇన్ని పార్టీలతో కష్టమే!

-

తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. ఒకటి, రెండు కాదు..దాదాపు 10 పార్టీల వరకు కనిపిస్తున్నాయి. అలాగే ఒకో పార్టీకి ఒకో ప్రాంతంలో పట్టు ఉన్నట్లు కనిపిస్తుంది. దీని వల్ల ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో అర్ధం కాకుండా ఉంది. ఇన్ని పార్టీల మధ్య ఓట్ల చీలిక వల్ల ఎవరికి డ్యామేజ్ జరుగుతుందో తెలియకుండా ఉంది. అసలు తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న పార్టీలు వచ్చి…బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పి, టి‌డి‌పి, వైఎస్సార్టీపీ, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి, టి‌జే‌ఎస్..ఇంకా చిన్నాచితక పార్టీలు చాలా ఉన్నాయి. కానీ ఈ పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..దాదాపు అన్నీ పార్టీల ప్రభావం ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా అని చెప్పవచ్చు. ఇక్కడ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, టి‌డి‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి, వైఎస్సార్టీపీ పార్టీల ప్రభావం ఉంది. ఇప్పుడుప్పుడే బి‌జే‌పి కూడా బలపడుతుంది. దీంతో ఖమ్మంలో ఈ సారి ప్రజలు కంటే పార్టీలే గెలుపోటములని డిసైడ్ చేసేలా ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కడ ప్రభావం చూపుతుంది..ఎక్కడ ఓట్లు చీలుస్తుందో అర్ధం కాకుండా ఉంది.

దీని వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో..ఏ పార్టీకి లాభం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్తితి. ఇప్పుడున్న పరిస్తితుల్లో వైఎస్సార్టీపీ, బి‌ఎస్‌పి, కమ్యూనిస్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో టి‌డి‌పి వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే కమ్యూనిస్టులు ఎలాగో బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఉండటం వల్ల ఆ పార్టీకి లాభం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు..కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు వల్ల ప్లస్ అయ్యే  ఛాన్స్ ఉంది. అటు మిగతా పార్టీలు ఓట్లు చీలిస్తే మళ్ళీ కారు పార్టీకే బెనిఫిట్ అవుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి ఖమ్మంలో ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news