కోటంరెడ్డి మనసు మార్చుకున్నారా? రాజకీయ ఎత్తుగడ?

-

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్యంగా జగన్ కు అభినందనలు చెప్పారు. జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.   నెల్లూరు రూరల్ లోని బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సి‌ఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

బరాషాహిద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం కోసం రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసి జాప్యం చేశారని, 9 నెలలు అయినా ఆర్ధిక శాఖ అనుమతులు లేవని నిలిపేశారని,  6 నెలల పాటు ప్రభుత్వం పెద్దల చుట్టు తిరిగినట్లు తెలిపారు. అలాగే నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదని, ఇక పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టామని.. తమ ప్రయత్నంతో విజయం సాధించామని చెప్పుకొచ్చారు. చివరికి దర్గా అభివృద్ధి పనులకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇచ్చిందని,  ఇది తన విజయం కాదని నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటమని ఎమ్మెల్యే అన్నారు.

అధికార పక్షమా, ప్రతిపక్షమా అని కాదని… సంకల్పం ఉంటే ఏదైన సాధ్యం అవుతుందని,  ఎన్నికల వేళ మాత్రమే జండాలు, అజెండాల అని.. మిగిలిన సమయంలో ప్రజా సమస్యలే అని, నెల్లూరు రూరల్ సమస్యలపై రేపటి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు కోటంరెడ్డి తెలిపారు.

అయితే కోటంరెడ్డి అభినందనలు మాత్రమే చెప్పి..లాజికల్ గా నిధులు తెచ్చేలా చేసుకున్నామనేది ఆయన ఉద్దేశంగా ఉంది. ఇక ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా కోటంరెడ్డి మార్చుకుంటున్నారు తప్ప, మనసు మాత్రం మార్చుకోవడం లేదని చెప్పవచ్చు. ఆయన టి‌డి‌పిలో చేరడం మాత్రం ఖాయమే.

Read more RELATED
Recommended to you

Latest news