బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే రాములు నాయక్ వార్నింగ్

-

ఖమ్మం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన బిజెపి నాయకులు రవీంద్ర నాయక్ ముఖ్యమంత్రిపై విచక్షణ కోల్పోయి మాట్లాడడం సరికాదన్నారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. ముఖ్యమంత్రి పై వ్యక్తిగత విమర్శలు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. ఢిల్లీ నుంచి గల్లి దాకా బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. మళ్ళీ మాట్లాడితే ఊరుకోమన్నారు.

 

బిజెపి నాయకుల్లో మార్పు రాకపోతే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు రాములు నాయక్. గిరిజనులకు, బంజారాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రతి తండాను గ్రామపంచాయతీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. దేశ రాజధానిలో కూడా గిరిజన భవన్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రవీందర్ నాయక్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news