ఐదోతనం అంటే పూర్తి అర్థం ఏంటి?.. ముత్తైదువని ఎవరిని అంటారు?

-

ఆడవారి జీవితంలో పెళ్లి అనేది అద్భుత ఘట్టం.. మరో జీవితాన్ని ప్రారంభించడానికి మరో అడుగు..పెళ్లికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత ఆడవాళ్లు నిండుగా ఆభరణాలు, పూలు, రంగు రంగుల చీరలతో మహాలక్ష్మిలాగా ఉంటారు.. ఐదు రకాల అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువు అని పిలుస్తారు.. అయితే స్త్రీలు అలా ఐదు రకాల అలంకారాలను ధరించడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. పెళ్లి అయినా వివాహతలు కాళ్ళకి మెట్టెలు, పట్టీలు, చేతులకి గాజులు, మెడలో మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ, తలలో పూలు ధరిస్తూ ఉంటారు. ఒక్కో విషయానికి వస్తే.. పెళ్లైన స్త్రీకి కాళ్లు బోడిగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలని చెబుతుంటారు..

ఇలా వీటికి సైన్స్ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి..కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. నుదుటన దరించే కుంకుమ ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

ఇక మంగళసూత్రం.. మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటివల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. గాజులు వేసుకోవడం వల్ల రక్తపోటు రాకుండా ఉంటుంది.. అలాగే పూలు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె, ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని నమ్మకం. ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుడక, చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే.. అందుకే వీటిని ఎప్పటికి వదలకూడదని అంటారు..

Read more RELATED
Recommended to you

Latest news