నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి జగన్ అదిరిపోయే వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఎక్కడకక్కడ టిడిపికి చెక్ పెట్టడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు..ప్రతి ఒక్క నియోజకవర్గంపై ఆయన ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ప్రతి టిడిపి నేతని ఓడించడమే టార్గెట్ గా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై సైతం జగన్ ఫోకస్ పెట్టారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఆయన్ని ఓడించాలని చూశారు గాని..అది పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఇక ఇప్పుడు అధికారంలో ఉండటంతో..అధికార బలంతో..టెక్కలిలో అచ్చెన్నని నిలువరించడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే టెక్కలిలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. అలాగే ఇంచార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్‌ని పెట్టి పార్టీ బలం పెరిగేలా చేశారు. ఇప్పుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇంచార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ని తప్పించి..ఆయన భార్య దువ్వాడ వాణిని టెక్కలి ఇంచార్జ్ గా పెట్టారు. దీని ద్వారా టెక్కలి నుంచి పోటీ చేసేది వాణి అని క్లియర్ గా చెప్పేశారు.
అయితే జగన్ ఇలా సడన్ గా కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికే దువ్వాడ శ్రీనుకే టెక్కలి సీటు అని జగన్ ఇదివరకే చెప్పారు. కానీ ఇప్పుడు సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు. దువ్వాడకు నియోజకవర్గంలో కాస్త వ్యతిరేకత ఉందని తెలిసిని..ఈ క్రమంలో ఆయన భార్యని రంగంలోకి దించారు..దీని ద్వారా మహిళా ఓట్లు కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
ఎలాగో దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఉంది..ఇక ఆయన ఫ్రీ గా ఉండటం వల్ల..తన భార్య గెలుపు కోసం ఇంకా ఎక్కువ కష్టపడతారు. మొత్తానికి జగన్ వ్యూహాత్మకంగానే దువ్వాడ భార్యని టెక్కలి అభ్యర్ధిగా డిసైడ్ చేశారని తెలుస్తుంది. చూడాలి మరి టెక్కలిలో అచ్చెన్నకు వైసీపీ చెక్ పెడుతుందో లేదో.