మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం యోగి

-

నేరగాళ్లకు కాంట్రాక్ట్ పనులు కట్

అవినీతి,అక్రమాల నియంత్రణపై ఉక్కుపాదం మోపిన అదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేర నేపథ్యం లేదా చెడ్డ పేరుఉన్న కాంట్రాక్టర్లను నీటిపారుదల ప్రాజెక్టుల కోసం వేలం వేయడానికి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ప్రభుత్వ అధికారులపైకూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేర నేపథ్యం, ​​మాఫియా ధోరణులు లేదా చెడ్డపేరు ఉన్న ఎవరినీ నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టులను వేలం వేయకూడదని, కాంట్రాక్టర్‌ను నిర్ణయించేటప్పుడు సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా ఇది నిర్ధారించబడాలని ఆదిత్యనాథ్ అన్నారు.

జులై నుంచి సెప్టెంబరు వరకు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. కొండల పైనుంచి వచ్చే నదులు వరద నీటితో ప్రవహిస్తూ ఊర్లను ముంచెత్తుతాయి. ప్రతి ఏడాది ఇలాంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. 24 నుంచి 28 జిల్లాలు వరడా ప్రభావానికి గురవుతూ ఉంటాయి. అయితే అలాంటి కష్టాలకు చెక్ ఇట్టే క్రమంలో నీటి పారుదల ప్రోజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు.నేర చరిత్ర ఉన్నవాళ్లకు టెండర్లు కట్టబెడితే పనులు సక్రమంగా జరగవు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అక్రమార్కులకు కొమ్ము కాసే అధికారుల పట్ల కఠిన వైఖరి తప్పదని ఈ మేరకు యోగి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news