మెగా ఫ్యాన్స్‌కు అలర్ట్‌.. ‘భోళాశంకర్’ నుంచి ప్రోమో విడుదల

-

మెగా అభిమానులకు పునకాలు తెప్పించే అప్డేట్‌ ఇచ్చారు భోళాశంకర్‌ చిత్రయూనిట్‌. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ నుంచి ఇక పాటల అప్ డేట్లు రానున్నాయి. చిరంజీవిపై చిత్రీకరించిన ఓ హుషారైన సాంగ్ కు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం నేడు విడుదల చేసింది. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఆర్కెస్ట్రయిజేషన్ చూస్తే పక్కా మాస్ బీట్ అని అర్థమవుతోంది. ఈ ప్రోమోలో చిన్న మ్యూజిక్ బిట్ ను మాత్రమే వదిలారు. దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ను జూన్ 4న విడుదల చేయనున్నారు.

Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే.. -  Telugu News | Bhola Mania song promo released from Bhola Shankar movie  Starrer Megastar Chiranjeevi telugu cinema news | TV9 Telugu

మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ కాగా… చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మురళి శర్మ, రవిశంకర్, రఘుబాబు, వెన్నెల కిశోర్, తులసి, ఉత్తేజ్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news