ఎడిట్ నోట్: జగన్‌పై కాషాయ అస్త్రం.!

-

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి..సమీకరణాలు మారిపోతున్నాయి..ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు గట్టిగానే పోరాటం చేస్తున్నాయి..విమర్శలు చేస్తున్నాయి. అటు మిగిలిన విపక్ష పార్టీలు సైతం జగన్ ప్రభుత్వం లక్ష్యంగానే విరుచుకుపడుతున్నాయి. కానీ బి‌జే‌పి మాత్రం కాస్త సాఫ్ట్ కార్నర్ తో ఉంది. కాకపోతే ఏపీలో కొందరు బి‌జే‌పి నేతలు జగన్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం చేయడం లేదు.

అటు కేంద్ర పెద్దలు సైతం జగన్ ప్రభుత్వానికి పరోక్షంగా అండగానే ఉంటున్నారు. అలాగే జగన్ కు అనుకూలంగానే పనులు కూడా చేసి పెడుతున్నారు. ఇటీవల భారీగానే నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో బి‌జే‌పి, వైసీపీ ఒక్కటే అనే భావన ప్రజల్లో కనిపిస్తుంది. అయితే బి‌జే‌పి పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సరిగ్గా సాయం అందించడం లేదనే కోపం ఉంది. అదే సమయంలో వైసీపీపై కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో రెండు పార్టీలు ఒక్కటే అనే భావన ప్రజల్లో ఉండటంతో జగన్‌కు కాస్త ఇబ్బంది అవుతుంది.

ఇలాంటి పరిణామాల్లో బి‌జే‌పి ఊహించని విధంగా రూట్ మార్చింది..ఇటీవల చంద్రబాబుతో కేంద్రం పెద్దలు భేటీ అయ్యారు. అలాగే ఇప్పుడు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమిత్ షా, జే‌పి నడ్డా జగన్ ప్రభుత్వం టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని, కేంద్ర పథకాలపై జగన్‌ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని, పేదల కోసం ఇచ్చిన బియ్యాన్నీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విశాఖపట్నాన్ని భూ రాబందుల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు.

ఇలా జగన్ ప్రభుత్వంపై షా ఫైర్ అయ్యారు. అయితే ఇలా సడన్ గా బి‌జే‌పి..జగన్ పై ఫైర్ అవ్వడం పెద్ద కారణం ఉందని తెలుస్తుంది. అయితే ఈ విమర్శల్లో రెండు కోణాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసి..బి‌జే‌పి కూడా విమర్శలు స్టార్ట్ చేసిందని అంటున్నారు. రెండు..బి‌జే‌పికి ఎలాగో యాంటీ ఉంది..అది వైసీపీపై పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు విమర్శలు చేయడం, టి‌డి‌పికి దగ్గర అవ్వడంతో..బి‌జే‌పికి ఉన్న యాంటీ వైసీపీకి రాకుండా టి‌డి‌పికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ రెండిటిల్లో ఏది నిజమో కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news