టీ.కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్..సీన్ మారిపోతుందా?

-

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ..అక్కడ అధికారంలోకి రావడానికి నానా తిప్పలు పడుతుంది. వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోయింది. రెండుసార్లు ఓటమి పాలైతేనే ఆ పార్టీ చాలావరకు దెబ్బతింది. కే‌సి‌ఆర్ వ్యూహాలతో ఇబ్బందుల్లో పడింది. నేతలు వలస వెళ్ళిపోయారు. ఇదే సమయంలో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇంకా ఉనికి కోల్పోయినట్లే అని ప్రచారం మొదలైంది.

ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది..ఆ పార్టీలోనే నేతలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం నడిపిస్తున్నారు. నిజానికి క్షేత్ర స్థాయిలో బి‌జేపి కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ బలం ఉంది. దీంతో కాంగ్రెస్ రేసులో రావడం సులువైంది. ఇటు కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం..తెలంగాణలో కలిసొచ్చింది. అక్కడ నుంచి కాంగ్రెస్ దూసుకొస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది. దక్షిణాదిలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందనే సమయంలో కర్నాటక పి‌సి‌సి అధ్యక్షుడు డి‌కే శివకుమార్..తనదైన వ్యూహాలతో కర్నాటకలో కాంగ్రెస్‌ని గెలిపించి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

ఇక ఆయన్ని ఇప్పుడు తెలంగాణకు పంపించి..అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలని అప్పగించాలని ప్లాన్ చేస్తున్నట్లు  తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్ రావు థాక్రే ఉన్నారు. ఆయన్ని కంటిన్యూ చేస్తూనే..అదనంగా డి‌కేని ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ నేతలని సమన్వయం చేసుకుని అక్కడ అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే డీకే రంగంలోకి దిగితే రాజకీయం, ఆర్థికం, అంశాల్లోనూ తిరుగులేకుండా ముందుకెళ్తారు. కర్ణాటకలో ప్రకటించిన గ్యారెంటీల వంటి పథకాలు తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్లాన్ చేసి..ఇక్కడ కూడా సక్సెస్ అవుతారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news