ఎడిట్ నోట్: హస్తంలో భారీ మలుపు..!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అధికారంలోకి వస్తుందా? అనే చర్చ జరగలేదు. ఎంతసేపు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. ఆ రెండు పార్టీల మధ్యే ఎన్నికల పోరు నడుస్తుందని విశ్లేషణలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ రేసులో వెనుక పడిపోయిందని, మూడో స్థానానికి పరిమితం అవుతుందని అన్నారు.

అయితే ఇవన్నీ కల్పిత కథనాలు అని అర్ధమైపోయింది. వాస్తవానికి తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ తర్వాత బలం ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కేవలం బి‌జే‌పిని రాజకీయం కోసం రేసులోకి తెచ్చారని తెలిసిపోయింది. బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో బలం లేదనే సంగతి తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఫామ్ లోకి రావడానికి కర్నాటక ఎన్నికల ఉపయోగపడ్డాయి. అక్కడ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. పక్కనే ఉన్న తెలంగాణపై ప్రభావం పడింది. భవిష్యత్ కాంగ్రెస్‌కే ఉందని క్లారిటీ వచ్చింది.

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం అర్ధమైంది. ఇక మొన్నటివరకు బి‌జే‌పిలోకి వలసలు నడిస్తే ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. అసలు ఆ నేతల కోసం బి‌జే‌పి ప్రయత్నించిన సరే..వారు కాంగ్రెస్ వైపే వెళ్తామని అంటున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది..

అలాగే ఊహించని విధంగా బి‌ఆర్‌ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపు వస్తున్నారు. వీరే కాదు..బి‌ఆర్‌ఎస్ లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రావడానికి రెడీ అయ్యారని తెలిసింది. అటు కొందరు జెడ్పీ చైర్మన్లు, కీలక నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇక ఈ చేరికలే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపు అని చెప్పవచ్చు. దీంతో దెబ్బకు సీన్ మారిపోతుంది. బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు పోరు మొదలైంది. మరి ఈ పోరులో పై చేయి ఎవరిది అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news