2023 రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ లాభమా

-

జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో డెరెక్ ఓబ్రెయిన్, సుస్మితా దేవ్, శాంతా ఛెత్రి, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుఖేందు శేఖర్ రేల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనుంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌కి చెందిన లుజిన్హో జోక్విమ్ ఫలేరో రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి కూడా జూలై 24న ఉప ఎన్నిక జరగనుంది.మరోవైపు గుజరాత్‌కు చెందిన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, దినేష్‌ జెమల్‌భాయ్‌ అనవాదియా, లోఖండ్‌వాలా జుగల్‌ సింగ్‌ మాథుర్జీ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి.అయితే గుజరాత్ లో బీజేపీ ఒక్క స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ను మాత్రమే పోటీలో నిలిపింది.మిగిలిన రెండు స్థానాలకు తన మిత్రపక్షాల అభ్యర్థులను బరిలోకి దింపతోంది. గోవా నుంచి వినయ్ టెండూల్కర్ పదవీకాలం కూడా జూలై 28తో ముగియనుంది. విశేషమేమిటంటే బెంగాల్ నుంచి బీజేపీ తరపున ఒక్కరు కూడా రాజ్యసభలో లేరు. ఈసారి అక్కడ ఒకరిని బరిలోకి దింపే అవకాశం వచ్చింది బీజేపీకి. అయితే ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా మరో అభ్యర్థిని కూడా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఆరు, గుజరాత్ నుంచి మూడు, గోవా నుంచి ఒకటి ఉన్నాయి. గుజరాత్, గోవాలలో బీజేపీ అన్ని సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్నా బెంగాల్‌లో కూడా బీజేపీ ఖాతా తెరవడం ద్వారా మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.గుజరాత్ శాసనసభలో బంపర్ విజయంతో 182 స్థానాలకు గాను 157 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. మొత్తం సీట్ల లెక్కన చూస్తే బీజేపీకి 138 ఓట్లు రావాల్సి ఉంటుందని, దీని వల్ల బీజేపీ అన్ని సీట్లు గెలుస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అక్కడ దిగజారడం వల్ల ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది.అదే సమయంలో, గోవాలోని 40 సీట్ల అసెంబ్లీలో బీజేపీకి 20 సీట్లు ఉన్నాయి మరియు స్వతంత్రుల మద్దతు ఉండటం వలన బీజేపీ ఒక్క రాజ్యసభ సీటును సునాయాసంగా గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లోని ఆరు స్థానాల్లో, ప్రస్తుతం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు ఐదు స్థానాల్లో పోటీ పడుతోంది. అయితే, ఈసారి బీజేపీకి బెంగాల్ నుంచి తొలి రాజ్యసభ ఎంపీ లభించవచ్చు. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఒక స్థానానికి 43 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఒక్క సీటు రావడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో సీటును కైవసం చేసుకునేందుకు బీజేపీ అవకాశాలను వెతుకుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో టీఎంసీకి 220 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఐదు సీట్లు గెలవాలంటే టిఎంసికి 215 ఓట్లు అవసరం కాగా కొంతమంది ఎమ్మెల్యేలు జైలుకెళ్లడంతో మమత పార్టీ ఒక స్థానంలో వెనుకంజలో ఉంది. ఇక్కడ బీజేపీ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news