ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో జంపింగులు నడుస్తున్న విషయం తెలిసిందే. అది కూడా కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. బిఆర్‌ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. బిఆర్‌ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. బిజేపికి ఎలాగో బలం లేదు కాబట్టి..కాంగ్రెస్ బెటర్ అని అటు వెళుతున్నారు.
అదే సమయంలో బిజేపి బలహీనపడటం..ఇప్పుడు దూకుడు తగ్గేలా మార్పులు చేయడంతో..ఆ పార్టీలోని కొందరు కీలక నేతలు కాంగ్రెస్ చేరాలని చూస్తున్నారు. అయితే ఈటల రాజేందర్ మాత్రం అలాంటిదేమీ లేదని, అసలు కాంగ్రెస్ లోకి ఎవరూ వెళ్ళడం లేదని, బిజేపిని వదలరని, కాంగ్రెస్ కు అంత సీన్ లేదని, ఆ పార్టీకి జాకీలు పెట్టిన లేవదని అన్నారు. అంటే అలా చెప్పడం ద్వారా జంపింగులు ఆగుతారనేది ఈటల ప్రయత్నం. కానీ అలా జరిగేలా లేదు. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగేలా ఉన్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి గ్రౌండ్ రెడీ చేసుకున్నారని తెలిసింది.
కానీ ఆయనని ఆపడానికి బిజేపి తాజాగా కీలక పదవి వచ్చింది. జాతీయ కార్యవర్గంలో చోటు ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల కోమటిరెడ్డి ఆగుతారేమో అని అనుకుంటున్నారు. కానీ కోమటిరెడ్డి జంపింగ్ ఖాయమని తెలుస్తుంది. అటు ఈటల ప్రధాన అనుచరుడు ఏనుగు రవీందర్ రెడ్డి సైతం బిజేపిని వీడటం ఖాయమని తెలుస్తుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారాలని చూస్తున్నారని తెలిసింది.
అంటే ఈటల ఎలాగోలా జంపింగులకు బ్రేకులు వేయాలని అనుకుంటున్నారు. కానీ వారు ఆగేలా లేరు. బిజేపికి బలం లేని కారణంతో జంపింగులు ఎక్కువ జరిగేలా ఉన్నాయి.