తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజాగా అధికార పార్టీ పై మరియు సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు ఎక్కు పెట్టారు. ఈయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష లేదని.. అన్ని రాష్ట్రాల లాగా దీనిని కూడా సమానంగా చూస్తున్నారన్నారు. అనవసరంగా… నిరాధారమైన వ్యాఖ్యలతో ప్రధాని మోదీని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని చెప్పారు. దేశ ప్రధాని గురించి మాట్లాడే ముందు, ఆలోచించుకోవాలని BRS నేతలకు సలహా ఇచ్చారు కిషన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఏదైనా పని జరగాలంటే, ఖచ్చితంగా అందుకోసం సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంతోకొంత పెర్సెంటేజ్ ఇవ్వాల్సిందే అన్నారు. ఇక కేసీఆర్ కుటుంబాన్ని ప్రతి ఒక్క విషయంలో తూచా తప్పకుండా అనుసరిస్తున్న BRS నేతలు కూడా వాటాలు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఈ రాష్ట్రము బాగాపడాలంటే.. అభివృద్ధి పధంలో నడవాలంటే బీజేపీ నాయకత్వం రావాల్సిందే అన్నారు.. కాంగ్రెస్ మరియు BRS లు ఒకే గూటి పక్షులు లాంటి వారని ప్రజలు వీరిని నమ్ముకుంటే ఉపయోగం లేదన్నారు.