సిర్పూర్‌లో ఆర్‌ఎస్..కాంగ్రెస్‌ సపోర్ట్‌? కొనప్పకు చెక్?

-

తెలంగాణలో మొదట నియోజకవర్గం సిర్పూర్‌లో ఇప్పుడు రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా రాజకీయంగా భారీ యుద్ధం పెద్దగా జరగదు. కానీ ఈ సారి పోరు రసవత్తరంగా ఉండేలా ఉంది. పైగా వరుసగా గెలుస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఈ సారి చిక్కులు వచ్చేలా ఉన్నాయి. తెలంగాణ మొట్ట మొదట నియోజకవర్గంగా ఉన్న సిర్పూర్ లో మొదట నుంచి కాంగ్రెస్ సత్తా చాటేది.

1952లో ఏర్పడిన ఈ స్థానంలో మొదట సోషలిస్ట్ పార్టీ గెలవగా, తర్వాత నుంచి 1983 టి‌డి‌పి వచ్చేవరకు వరుసగా ఐదు సార్లు కాంగ్రెస్ గెలిచింది. 1983, 1985లో టి‌డి‌పి గెలిచింది. 1989, 1994లో ఇండిపెండెంట్ గెలవగా, 1999లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్ నుంచి కోనేరు కొనప్ప గెలిచారు. 2009 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. ఇక తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో బీఎస్పీ గెలిచింది. బీఎస్పీ నుంచి కోనేరు కొనప్ప గెలిచారు.  ఆ తర్వాత ఆయన బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు.

ఇక 2018 ఎన్నికల్లో మరొకసారి కోనేరు విజయాన్ని అందుకున్నారు. ఇలా వరుసగా రెండుసార్లు గెలిచిన కోనేరుకు ఈ సారి పాజిటివ్ పెద్దగా లేదు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తుంది. ఇదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ బలపడుతుంది..ఇక ఇక్కడ రాజకీయాన్ని మరింత వేడి ఎక్కించేలా బి‌ఎస్‌పి నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగుతానని ప్రకటించారు.

దీంతో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌ఎస్‌పి నుంచి త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. దీంతో కాంగ్రెస్ రేసులో తప్పుకుని ఆర్‌ఎస్‌కు సపోర్ట్ ఇస్తే..కొనప్పకు చెక్ పడుతుంది. అలా కాకుండా త్రిముఖ పోరు జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పలేం. మొత్తానికి ఈ సారి సిర్పూర్‌లో హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news