తెలంగాణాలో ప్రస్తుతం వివిధ సమస్యల పైన అధికార మరియు విపక్షాలకు జోరుగా వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వరదల మయం కావడం వలన ప్రాజెక్టు లపై ప్రభుత్వం పైన విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా కడెం ప్రాజెక్ట్ గురించి బీజేపీ నేత ఈటల రాజేందర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు ల గురించి కనీసం అవగాహన లేని వారు మంత్రిగా ఉండడంలో ఎటువంటి ఉపయోగం లేదని కామెంట్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం నుండి కడెం ప్రాజెక్టు కు నిధులు వచ్చేలా చర్యలు తీసుకుని, వీలైనంత త్వరగా ప్రాజెక్టు కు మరమ్మతులు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. దేవుడిపై భారం వేసే మంత్రులు మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టమన్నారు ఈటల.
కాగా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేయిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.