వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే : కొప్పుల ఈశ్వర్‌

-

కరీంనగర్‌ జిల్లాలోని వెల్గటూరు, ఎండపల్లి మండలాల పరిధిలోని ఎండపల్లి, కిషన్ రావుపేట, ముత్తునూరు, రాంనూరు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. అధికారం కోసమే కాంగ్రెస్ ఆరాట పడుతోందని, 40 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమేనని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

May be an image of 6 people, poster, banner, plant, dais, temple and text

ఒకప్పుడు సాగు తాగునీరు కోసం గోసపడిన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు కొప్పుల ఈశ్వర్. వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కాలంలోనే ప్రత్యేక శ్రద్ధతో బొమ్మరిల్లులాగా తీర్చిదిద్దిన తరువాత అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆరాటపడుతోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన 3 గంటల కరెంట్ మాటను రైతులు ఎప్పటికీ మర్చిపోరని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news