Breaking : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌

-

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కేంద్ర కేబినెట్ ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. రైల్వే లైన్ విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాలలో ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది కేంద్ర కేబినెట్‌. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి… గుంటూరు – బీబీ నగర్ డబ్లింగ్ సహా వివిధ పనులకు ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులను రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కిలో మీటర్ల మేర పనులు చేయనుంది కేంద్రం.

One of most beautiful railway routes in India - Kollam - Sengottai railway  line - YouTube

దీంతో పాటు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ మధ్య డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. రూ.417.6 కిలో మీటర్ల మేర రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో బారాంగ్, కుర్దా రోడ్ – విజయనగరం వరకు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్‌కు ఆమోద ముద్ర వేసింది. మొత్తం రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో యూపీ, బీహార్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్ వర్క్‌ను విస్తరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news