తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ను రేపో, మాపో ప్రకటించనున్న విషయం తెలిసిందే. తాజాగా కొంత మంది పేర్లు బయటికి రావడంతో వారు సంతోషంగా ఉన్నారు. టికెట్ రాని వారు ఆగ్రహంతో ఉన్నారు. అయితే స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరికి టికెట్ వచ్చినట్టు తెలుస్తోంది..ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశఆరు. మీ అందరిని చూస్తే మళ్ళీ నాకు పాత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నాకు రాజకీయ జన్మనిచ్చిందని.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన రాజకీయ బిక్ష వలనే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నట్టు వెల్లడించారు.
ఈ నియోజకవర్గ ప్రజలు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేశాను తప్ప , తప్పు పని చేయలేదు అన్నారు. చెడు ప్రవర్తనతో మీకు తలవొంపులు తీసుకువచ్చే పని నేను చేయలేదు , నేను అలాంటి వ్యక్తిని అసలే కాదు అని పేర్కొన్నారు కడియం శ్రీహరి. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కూడా ఒకటి. మార్పు జరిగి నాకు అవకాశం వస్తే నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది.నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది అన్నారు. నియోజకవర్గానికి చెడ్డ పేరు తేను , తప్పు చేయను అని.. కడియం శ్రీహరి వస్తే అవినీతిపరులకు అడల్ అని.. నేను వస్తున్నాను అంటేనే గోకేవారు , గీకేవారు , భూ కబ్జాదారులు పారిపోవాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు.