మెట్లు ఎక్కడం వల్ల ఈ 9 రకాల క్యాన్సర్లు రావు..

-

రోజూ ఎంతో కొంత దూరం నడవాలి, వాకింగ్‌ చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో రోగాలను వాకింగ్‌ నయం చేస్తుంది. కానీ తీరిగ్గా నడిచే అంత టైమ్‌ ఎవరకీ ఉండటం లేదు. వాకింగ్‌ మాత్రమే కాదు.. మెట్లు ఎక్కడ వల్ల కూడా అంతే లాభాలు ఉన్నాయి. కానీ ఎవరూ ఆ పని చేయరు. లిఫ్ట్‌నే ప్రిఫర్‌ చేస్తుంటారు. మెట్లు ఎక్కడం వల్ల మీరు తొమ్మిది రకాల క్యాన్సర్ల బారి నుంచి బయట పడొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. మెట్లు ఎక్కడం వల్ల కండరాలు గట్టి పడతాయి. ఫిట్‌గా ఉండే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు సగానికి పైగా తగ్గుతుందని అధ్యయనం కనుగొంది.

స్వీడన్‌లో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం ఫిట్‌గా ఉన్న పురుషుల్లో కణితం తొమ్మిది రకాల కణితుల నుంచి రక్షణ పొందుతారని తేలింది. 16 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువకులని పరిశీలించారు. వారిలో గుండె, ఊపిరితిత్తులు, మెడ, గొంతు, కడుపు, క్లోమం, కాలేయం, పేగు, మూత్రపిండాల్లో కణితులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తేలింది. గోథెన్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఆరోన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన యువకులలో ఫిట్ నెస్ బాగుండే వారిలో 18 రకాల క్యాన్సర్లలో 10 అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనం సూచిస్తుంది. యువతలో కార్డియోస్పీరేటరీ ఫిట్ నెస్ పెంచేందుకు ఈ అధ్యయనం మరింత బలాన్ని ఇస్తుంది.

అధ్యయనం ఇలా జరిగింది..

1968 నుంచి 2005 మధ్య సైనిక నిర్బంధ సమయంలో ఉన్న వారి ఆరోగ్యాన్ని పరిశోధకులు చెక్ చేశారు. దాదాపు 33 సంవత్సరాలు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. వారిలో చాలా మందికి 60 ఏళ్ల లోపు క్యాన్సర్లు వచ్చినట్టు గుర్తించారు. బ్రిటీషర్లు ఏదో ఒక సమయంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఒక సర్వే ప్రకారం.. సగం మందికి పైగా స్త్రీలు, మూడవ వంతు పురుషులు ఎటువంటి వ్యాయామం చేయడం లేదు. 50 శాతం మంది పిల్లలు ప్రతిరోజూ చురుకుగా ఉంటున్నారు. ఇక ముగ్గురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. పెద్దలు ప్రతి వారం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని అక్కడి వైద్య సంస్థలు చెబుతున్నాయి. పిల్లలు రోజుకి ఒక గంట పాటు ఆరుబయట ఆడుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, హార్మోన్ స్థాయిలని సమతుల్యం చేయడం, రక్తపోటు, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం.. తక్కువ ఫిట్ నెస్ ఉన్న వ్యక్తులు ఊబకాయం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగానికి ఎక్కువగా బానిసలు అవుతున్నారు. వేగంగా నడవడం, జాగింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, ఈత కొట్టడం, మెట్లు ఎక్కడం వంటి వాటి వల్ల కార్డియో ఫిట్ నెస్‌ని పెంచుకోవచ్చు. కాబట్టి మెట్లు ఎక్కే వీలుంటే మెట్లే ఎక్కండి. మనిషి సుఖంగా ఉండాలంటే శరీరం కష్టపడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news