ఎడిట్ నోట్: సనాతన ధర్మం-ఇండియా టూ భారత్..!

-

ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే గుర్తుకొచ్చేది భారతీయుల అవలంబించే సనాతన ఆచారాలు సాంప్రదాయాలు. భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా వారందరూ ఆచరించేది మాత్రం సనాతన ధర్మాన్నే. ఎన్ని మతాలు ఉన్నా హిందూ మతాన్ని ఆచరించేవారు ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశాన్ని హిందూ దేశమని అంటారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నా సనాతన ధర్మాన్ని రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం వక్ర భాష్యాలు చెప్తున్నారు. ఎంతో గొప్పదైన భారతీయ సనాతన ధర్మాన్ని ఒక వైరస్ లేదా ఒక వ్యాధితో పోల్చడం యావత్ హిందువులందరినీ బాధిస్తున్నది. అలా మాట్లాడింది సాధారణ వ్యక్తి అయితే వదిలేయవచ్చు కానీ, అలా అన్నది సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు రాష్ట్రానికి మంత్రి అయినా ఉదయనిది స్టాలిన్.

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వైరస్ వంటి వ్యాధులతో సమానమైనదని దానిని నిర్మూలించాలని బహిరంగ సభలో మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యలను బిజెపి, వి హెచ్ పి, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

కూటమిలోని కాంగ్రెస్, తదితర పార్టీలన్నీ వ్యక్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అంటూ సమర్ధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉదయనిది స్టాలిన్ మాత్రం తాను సనాతన ధర్మాన్ని నమ్మనని, అది కులం మతం పేరుతో ప్రజలను విడదీస్తుందని, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నానని తాను తప్పు మాట్లాడలేదని సమర్థించుకుంటున్నాడు.

ఒక ప్రజా ప్రతినిధి కులమతాలు  లేకుండా సమానత్వంగా ఉండాలి అని చెప్పడంలో తప్పులేదు గాని, ఒక మతాన్ని విమర్శించేలా మాట్లాడకూడదని అందరూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రధాని మోదీ సైతం..ఉదయనిధి వ్యాఖ్యలకు కౌంటరుగా స్పందించారు. ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలకు తగు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. సనాతన ధర్మంపై దాడులను వాస్తవాలతో తిప్పికొట్టాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ముంబైలో జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో హిందూయిజానికి వ్యతిరేకంగా విపక్షాలు తీర్మానించాయని.. అందులో భాగంగానే ఉదయనిధి సనాతన ధర్మాన్ని టార్గెట్‌ చేశారని, కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిస్తోందని బీజేపీ ఫైర్ అవుతుంది.

ఇక ఇదే సమయంలో ఇండియా పేరుని భారత్‌గా మార్చడంపై మోదీ స్పందించారు. ఇండియా పేరును భారత్‌గా మార్చే అంశంలో ఎవరూ మాట్లాడరాదని, అధికార ప్రతినిధి మాత్రమే దీనిపై స్పందించాలని స్పష్టం చేశారు. మొత్తానికి అటు సనాతన ధర్మం..ఇటు ఇండియా టూ భారత్ పేరు మార్పుపై దేశ రాజకీయాలు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news