సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడమే తన తప్పు అని ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్య మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే తనతో పాటు కేటీఆర్, హరీశ్, జగదీష్ వంటి నేతలనూ ఆయన పట్టించుకునేవారు కాదన్నారు. ఓ సారి కేటీఆర్ ను బుల్డోజ్ చేస్తే ఆయన బాధపడ్డారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేసీఆర్ మనసులో ఏం ఉంటుందో తెలియదు కానీ.. ఎవరు కలిసినా బాగా పలకరిస్తారని, మంచిగా భోజనంతో సంతోషపెడతారు’ అని పేర్కొన్నారు.
ఈటల మాట్లాడాతు..2021 ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ బానిసలుగా వందల కోట్లు ఖర్చు బెట్టి ..ఉద్యమ బిడ్డ ఈటెల రాజేందర్ ను ప్రజాస్వామ్యాన్ని నలిపేయాలని చూశారు అంటూ ఆరోపించారు. హుజూరాబాద్ లో జరిగిన ఉపఎన్నికల్లో తనను పెట్టిన హింసకు శికండి వ్యవహారం చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని గజ్వేల్ లో పోటీ చేస్తానని చెప్పానని వెల్లడించారు. గుండె కాయలాంటి హుజురాబాద్ లో పోటీ చేస్తూనే.. గజ్వేల్ లో పోటీ చేస్తున్నా.. తనను హుజూరాబాద్ ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. హుజురాబాద్ లో ప్రతీ ఇంటిలోను నాయకులు ఉన్నారని..హుజురాబాద్ ప్రజలతో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అన్నారు. తనంటే అక్కడి ప్రజలకు ఎంతో మమకారం ఉందని తాను వెళ్లకపోతే దిగులుపడిపోతారని రెండేళ్లనుంచి రాజేందర్ సార్ వస్తలేదని అనుకుంటున్నారని అన్నారు. తనంటే హుజూరాబాద్ ప్రజకలకు అంత ప్రేమ ఉందని భావోద్వేగానికి గురయ్యారు అని తెలిపారు.