మహేష్ తో మూవీ అంటేనే భయపడిపోతున్నారట….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం సరిలేలు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్, సరిలేరు నీకెవ్వరు తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. కాగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 11న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు ఏ దర్శకుడికి అవకాశం ఇస్తారు అనే విషయమై కొద్దిరోజులుగా టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే మహేష్ తదుపరి దర్శకుల లిస్ట్ లో వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, పరశురామ్ తదితరులు లిస్ట్ లో ఉండగా,

తన వద్దకు వస్తున్న దర్శకులకు మహేష్ బాబు మాత్రం ఒక కండీషన్ పెడుతున్నారట. ఆ కండీషన్ తో కొందరు దర్శకుడు బెంబేలెత్తుతున్నట్లు టాక్. అయితే ఆయన పెడుతున్న కండీషన్ ఏంటంటే, తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన దర్శకులు ఆయనకు కథలోని పూర్తి విశ్లేషణతో కూడా నారేషన్ ఇవ్వాలట, ఆ విధంగా పూర్తిగా వివరణ ఇచ్చిన దర్శకుల కథలకే మహేష్ బాబు పచ్చ జెండా ఊపుతున్నారట. అయితే మహేష్ ఈ విధంగా కండీషన్స్ పెట్టడానికి కారణం ఒకటి ఉందట,

 

ఇప్పటివరకు తాను నటించిన సినిమాలకు సంబంధించి కొందరు దర్శకులు చెప్పిన కథల్లో పూర్తి విశ్లేషణ ఇవ్వకపోయినప్పటికీ, ఆ దర్శకులను నమ్మి తాను సినిమాలు చేసి ఫ్లాప్స్ ఎదుర్కోవలసి వచ్చిందని, అందువల్లనే ఇక పై తాను చేయబోయే సినిమా కథల విషయమై పూర్తి విశ్లేషణ లేనిదే సినిమా అంగీకరించేది లేదని మహేష్ ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారట. అయితే మహేష్ బాబు ఈ విధంగా వ్యవహరించడం మంచిదే అని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఆ విధంగా సినిమా కథలు పూర్తి విశ్లేషణతో వింటే, ఇకపై హీరోల సినిమాలు ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుందని, అదీకాక స్టార్ హీరోల సినిమాలు నమ్ముకుని ఖర్చు చేసే కోట్లాది రూపాయల డబ్బుకు భద్రత ఉంటుందని, తద్వారా నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news