మిరప సాగులో తెగుళ్లు మరియు నివారణ చర్యలు..

-

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పంటలలో మిరప కూడా ఒకటి..ముఖ్యంగా కోస్తాంధ్ర లో మిరప సాగు అధికంగా ఉంటుంది..అయితే మిరప సాగులో కొన్ని మెలుకువలు పాటించడం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు..మిరపలో తెగుళ్ల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.వీటి నివారణ చర్యలను సరైన టైం లో తీసుకోవాలి.అప్పుడే పంట దిగుబడి కూడా బాగుంటుంది.. మిరపలో వచ్చే తెగుల్లు వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కాయ కుళ్ళు తెగుళ్లు:

ఈ శిలీంధ్రం గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సామాన్యంగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో లేత కొమ్మలకు మరియు పుష్పాలకు ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు మొదట పుష్పాలకు ఆశించి క్రమంగా కాండం కొమ్మలకు వ్యాపించును. కొమ్మల బెరడు పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడును. ఈ మచ్చలు పెద్దవైన తరువాత మచ్చల మధ్య భాగంలో శిలీంధ్ర బీజాలు వలయాలుగా ఉండును.

నివారణ:

పొలాన్ని శుభ్రంగా దున్ని మొదట్టును తీసివేయాలి.
కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టస్ / మాంకోజెట్ తో విత్తన శుద్ధి చేయాలి.ఆరోగ్యవంతమైన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించాలి.
ప్రోపికొనజోల్ 2 మి.లీ. డైఫెన్ కొనజోల్ మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పూత సమయంలో కాయలు పండు బారే సమయంలో పిచికారి చేయాలి.

ఆకు మచ్చ తెగుళ్లు:

ఆకుల పై చిన్న చిన్న గుండ్రని లేదా ఆకృతి లేని నీటితో తడిపినటువంటి మచ్చలు ఆకు అడుగు భాగాన ఏర్పడును. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులో నుండి ఊదా రంగులోనికి మారి మచ్చల మధ్యలో నల్లగా ఉండును. ఈ మచ్చల మధ్యలో గుంతగా ఉండి ఉబ్బి ఉండును. తర్వాత ఈ ఉబ్బిన భాగము గరుకుగా మారును. మచ్చల చుట్టూ చిన్న పసుపు పచ్చని వలయం ఉంటుంది. మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోవును. కొన్నిసార్లు ఆకు తొడిమ మరియు లేత కొమ్మలపై కూడా ఈ వ్యాధి వ్యాపించును. పచ్చి కాయల పై నీటిలో తడిపినటువంటి మచ్చలు కూడా ఏర్పడును. ఈ వ్యాధి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది.జూలై నుంచి సెప్టెంబర్‌లో ఎక్కువగా కనిపిస్తుంది…

నివారణ:

ఫాంటోమైసిస్ లేక స్ట్రెప్టోసైక్లిస్ 200 మందును ఏదైనా రాగి ధాతువు కల్గిన శిలీంద్ర నాశిని 0.25% కలిపి రెండు లేక మూడు సార్లు పిచికారి చేయవలెను..

బూడిద తెగులు:

ఈ తెగులు ఎక్కువగా నవంబర్ మరియు మార్చి మాసాల మధ్యలో మిరప పైరుకు ఎక్కువగా ఆశిస్తుంది. మొదట మొక్కల క్రింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడును. క్రమేపీ ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి పైకి కూడా విస్తరించును. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగు గా మారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులు సోకటం వలన పూత విపరీతంగా రాలిపోవును..చల్లగా ఉంటే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది..

నివారణ:

నీటిలో కరిగే గంధకం 3%, కేరాథెన్ 0.1% మందును పిచికారి చేయాలి..
పైన చెప్పిన విధంగా చెయ్యడం ద్వారా తెగుల్లు తగ్గి పంట దిగుబడి అధికం అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news