ఈరోజుల్లో పూలు, పండ్లు వ్యాపారం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతూంది.. దాంతో వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. ఉద్యానవనంలో నాణ్యమైన విత్తనాలు, పండ్లు మరియు పువ్వులు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విభిన్నమైన నేలలు మరియు వాతావరణాలతో మన దేశంలో అనేక రకాల వ్యవసాయ-పర్యావరణాలు ఉన్నాయి.
ఎన్నో రకాల ఉద్యానవనాలు మరియు పంటలను పండించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హైటెక్ గ్రీన్‌హౌస్‌లు, అంతర్గత పరిశోధనలు మరియు ఆఫ్-సీజన్ వ్యవసాయం ఉద్యానవన రంగంలో కొత్త అవకాశాలను తెరిచాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే పండ్లు మరియు కూరగాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి..
పండ్ల రైతులు తెలుసుకోవాల్సిన అంశాలు..
భూసార పరీక్షలు జరిపించి, వేయబోయే ఫలజాతులకు నేలలు అనుకూలమా కాదా అని నిర్ధారించాలి. నేలలోతు కనీసం రెండు మీటర్లుండాలి. కనీసం 2 మీ., దిగువ నీటి మట్టం ఉంటేనే ఆ నేల పండ్ల తోటల సాగుకు పనికి వస్తుంది.
వీలయినంత దగ్గర్లో పెద్ద పండ్ల మార్కెట్ ఉన్నట్లయితే రవాణా ఖర్చులు తగ్గటమే కాక రవాణాలో కాయ దెబ్బ తినక పండ్లు త్వరగా కొనుగోలు దారుకు చేరే అవకాశం ఉంది.
మంచి రోడ్లు, రవాణా సదుపాయాలు, శీతలీకరణ సదుపాయంలో గల ట్రక్కులు అందుబాటులో ఉండాలి.
పండ్ల తోటకు దగ్గరలో విద్యుత్ లైను ఉంటే మంచిది.
ఇతరులు వేసిన పండ్ల తోటలు దగ్గరగా ఉంటే అనేక సదుపాయాలు సహకార ప్రాతిపదికన తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు.
కావల్సినంత మంది కూలీలు అందుబాటులో ఉండాలి.
అంటు మొక్కలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉండాలి.
మన సొంత భూమి అయితే ఒకే కానీ కౌలుకు తీసుకున్న భూమి అయితే తక్కువ ధరలో ఉంటే మంచిది..
పండ్ల తోటలను వేయడానికి అనుభవం ఉన్న రైతులను కనుక్కోవాలి..ఇంకేదైనా సందెహాలు వుంటే వ్యవసాయ నిపునులను సంప్రదించాలి..