నల్లటి జుట్టు కోసం ఈ జ్యూస్ ను తప్పక తీసుకోవాల్సిందే..!

-

చాలా శాతం మంది జుట్టు ను నల్లగా మార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కెమికల్స్ వంటివి ఉపయోగించడం వలన జుట్టు ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటారో జుట్టు దృఢంగా ఉంటుంది. అదే విధంగా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. జుట్టు కు కెమికల్స్ ని ఉపయోగించడం వలన కేవలం తక్షణ ఉపశమనాన్ని మాత్రమే పొందగలరు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎప్పుడైతే మంచి ఆహారాన్ని తీసుకుంటారో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు అని చెబుతున్నారు.

ముఖ్యంగా ఉసిరికాయ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కీలక పాత్ర పోషిస్తుంది అనే చెప్పవచ్చు. ఉసిరికాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా విటమిన్ సి కూడా ఉంటుంది. కనుక ఉసిరికాయ రసాన్ని తాగడం వలన మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కేవలం జుట్టు ను నల్లగా మార్చడమే కాకుండా వేర్ల నుండి ఎంతో దృఢంగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఉసిరికాయ రసాన్ని కలిపి ప్రతి రోజు ఉదయాన్నే తాగడం వలన ఎంతో మార్పుని గమనిస్తారు.

ఇదే విధంగా మూడు నుండి నాలుగు నెలలు పాటు చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. తెల్ల జుట్టు ను తగ్గించడానికి తప్పకుండా ప్రయత్నించండి. కేవలం జుట్టుకి ఉపయోగపడడం మాత్రమే కాకుండా ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది మరియు శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. దీంతో పోషకాల లోపం కూడా ఉండదు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఉసిరికాయ రసం సహాయం చేస్తుంది. కనుక ఇటువంటి ప్రయోజనాలను పొందాలంటే తప్పకుండా ఉదయాన్నే ఖాళీ కడుపున ఉసిరికాయ రసాన్ని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version