ప్రస్తుత రోజుల్లో జుట్టు ఊడిపోవడం సాధారణ సమస్యగా మారిపోయింది. కారణం ఏదైనా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని నివారించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన పద్దతులు తెలియక అవస్థలు పడుతున్నారు. మరి జుట్టు రాలడాన్ని ఆపడానికి సరైన పద్దతులు ఏమిటి? ఏ విధంగా చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చో తెలుసుకుందాం.
జుట్టు సంరక్షణకి పనికొచ్చే పదార్థాలలో అన్నింటికన్నా ప్రముఖమైనది ఉల్లిపాయ అని చెప్పాలి. అవును, బట్టతలతో ఇబ్బంది పడే చాలామందికి ఉల్లిపాయ మేలు చేస్తుంది. ప్రస్తుతం ఉల్లిపాయను జుట్టు సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలనేది చూద్దాం.
హెయిర్ మాస్క్
ఉల్లిపాయ రసంలో ఆలివ్ ఆయిల్ కలుపుకుని తలకి మర్దన చేసుకుంటే బాగుంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి, శిరోజాల కుదుళ్ళు బలంగా తయారవుతాయి. ఇందుకోసం మీకు 3 చెంచాల ఉల్లిపాయ రసం, 2 చెంచాల ఆలివ్ ఆయిల్ అవసరం. తలకి మర్దన చేసుకున్న 2గంటల తర్వాత, షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసం, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, నిమ్మరసం కలుపుకుని నెత్తిమీద మసాజ్ చేసుకుని 30నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రపర్చుకుంటే చాలు.
ఉల్లిపాయ నూనె
జుట్టు సన్నబడడం, విఛ్ఛిన్నం అవడాన్ని పూర్తిగా తగ్గించాలంటే ఉల్లిపాయ రసాన్ని వాడాలి. దీనికోసం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో ఉల్లిపాయ రసాన్ని కలుపుకోవచ్చు. దీన్ని పొయ్యి మీద మరిగించాలి. ఆ తర్వాత చల్లారాక తలకి మర్దన చేయాలి. 3గంటల సేపు అలాగే ఉంచి షాంపూతో కడగాలి.
పై పద్దతులును ఉపయోగించే ఉల్లిపాయ చేసే మేలును సులభంగా పొందవచ్చు.