అందమైన మృదువైన కేశాలు కావాలని అందరూ కోరుకుంటారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హెయిర్ మాస్క్ సహా అన్నీ పాటిస్తుంటారు. కానీ మీకిది తెలుసా? మీరు చేసే చాలా చిన్న తప్పులే మీ జుట్టును బలహీనపర్చడానికి కారణం అవుతాయి. వాటిల్లో మొదటిది తలస్నానం సరిగ్గా చేయకపోవడం. ఇక్కడ తలస్నానం అంతే జుట్టును శుభ్రపర్చుకోవడం అని గుర్తుంచుకోండి. జుట్టు శుభ్రత సరిగ్గా లేనప్పుడు ఎన్ని సంరక్షణ సాధనాలు వాడినా ప్రయోజనం ఉండదు. అందుకే ముందుగా తలస్నానంలో ఈ తప్పులు చేయకండి.
ముందుగా కేశ సంరక్షణ కోసం ప్రతీరోజూ తలస్నానం చేయాలని మీరనుకుంటే అదే పెద్ద పొరపాటు అని చెప్పవచ్చ్చు. అవును, వారానికి కేవలం రెండు లేదా మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి.
అలాగే తలస్నానం చేసే ముందు డైరెక్టుగా కాకుండా ముందుగా గోరువెచ్చని నీళ్ళతో తలని తడపండి. షాంపూ చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఇది పాటించాలి. దీనివల్ల షాంపూ పనితీరు మరింత మెరుగవుతుంది.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, షాంపూ వేసుకునేవారు డైరెక్టుగా షాంపూని తలకి రుద్దవద్దు. దానివల్ల షాంపూలోని పోషకాలు సరిగ్గా జుట్టుకి చేరవు. అదీగాక అలా డైరెక్టుగా చేయడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అందువల్ల షాంపూని నీటిలో కరిగించండి. ఆ కరిగిన నీళ్ళని తలపై పోసుకోండి. షాంపూ వేసుకున్న తర్వాత మసాజ్ బ్రష్ వాడితే రక్తప్రసరణ సరిగ్గా జరిగి మంచి ఫలితం ఉంటుంది.
తలస్నానం చేసిన తర్వాత జుట్టుని ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్లను చాలా మంది వాడతారు. కానీ అది కరెక్టు కాదనే చెప్పాలి. దానిలోని వేడి కారణంగా జుట్టు విఛ్ఛిన్నం అయ్యే అవకాశం ఎక్కువ. అందువల్ల టవల్ తో తుడుచుకుని జుట్టు ఆరేవరకు ఊరికే ఉండడం మంచిది.