ముఖాన్ని రోజుకు ఎన్నిసార్లు క్లీన్‌ చేస్తున్నారు..?

-

వేసవి కాలంలో చెమట పట్టని వారంటూ ఎవరూ ఉండరు కదా..! స్నానమే రోజుకు రెండుసార్లు కచ్చితంగా చేస్తారు. ఇక మధ్య మధ్యలో చిరాకు అనిపించినప్పుడుల్లా ఫేస్‌ వాష్‌ చేసుకుంటాం. అసలు రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలి..? అదేంటి దీనికి కూడా ఒక లెక్క ఉంటుందా అనుకుంటున్నారా..? అవును మరీ.. మీరు సాధారంగా నీళ్లతో అయితే ఎన్నిసార్లు అయినా కడుక్కోవచ్చు. కానీ సోప్‌, ఫేస్‌వాష్‌ లాంటివి ఉపయోగిస్తే.. ఒక లెక్క కచ్చితంగా ఉంటుంది.

‘మీరు ముఖం కడుక్కున్నప్పుడు చర్మం ఉపరితలంపై పేరుకున్న మురికి, నూనె, చెమట మరియు మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ఇది రంధ్రాలను అన్‌క్లాగ్ చేయడంలో, మోటిమలు ఏర్పడకుండా నిరోధించడం, చర్మం తేమను నిలుపుకోవడం మరియు మొత్తం చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం మంచిదని పాల్ఘర్‌లోని అధికారి లైఫ్‌లైన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లోని చర్మవ్యాధి నిపుణుడు డా. మీరా అధికారి చెప్పారు.

ముఖాన్ని శుభ్రం చేయడానికి క్లెన్సర్ ఉపయోగించడం తప్పనిసరి. కానీ అన్ని క్లెన్సర్లు ముఖ చర్మానికి సరిపోవు. మీ చర్మాన్ని బట్టి క్లెన్సర్లను ఎంచుకోవాలని కూడా వారు చెబుతున్నారు. రాత్రిపూట ముఖం కడుక్కోవడం వల్ల ముఖంలోని మేకప్ మరియు మురికి తొలగిపోతుంది. నిద్రపోయే ముందు కచ్చితంగా ముఖం కడుక్కోని పడుకోవాలట.. ఎందుకంటే పగటిపూట చర్మం మురికి, కాలుష్యం మరియు బ్యాక్టీరియాను సేకరిస్తుంది. ఇది రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. మీరు ఈవినింగ్‌ స్నానం చేసినా సరే.. పడుకునేముందు కచ్చితంగా ముఖం కడుక్కోవాలి. మీ ముఖం కడగడానికి కనీసం 60 సెకన్లు తీసుకోండి. అలాగే నుదురు, ముక్కు, బుగ్గలు వంటి భాగాలను ఎక్కువ సమయం క్లీన్‌ చేయాలి.

అయితే ముఖాన్ని చెమట అనిపించినప్పుడు క్లాత్‌తో తుడుకోవడం కంటే వీలైతే కూల్‌ వాటర్‌తో క్లీన్‌ చేసుకోవడం బెటర్. అప్పుడే ఫేస్‌ ఫ్రెష్‌గా ఉంటుంది. బయట ఉన్నప్పుడు ఇలా ప్రతిసారి క్లీన్‌ చేసుకోవడం కుదరదు. అందుకే వెప్స్‌ వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version