చింతపండుని వంటల్లో వాడుతూ ఉంటాము. రకరకాల కూరలు పులిహోర వంటి వాటిని చేసుకోవడానికి కచ్చితంగా చింతపండు ఉండాలి. చింతపండులో పోషకాలు బాగానే ఉంటాయి విటమిన్స్ ఐరన్ పొటాషియం ఫైబర్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువ ఉంటాయి. చింతపండుతో చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది చింతపండు.
నాచురల్ బ్లీచ్ లాగా ఇది పనిచేస్తుంది చింతపండుని తీసుకుని పావుగంట వేడి నీళ్లలో నానబెట్టుకోండి. తర్వాత చింతపండుని మెత్తగా గుజ్జు చేసుకోవాలి ఈ గుజ్జులో మీరు అరటి గుజ్జు శనగపిండి వేసి పేస్ట్ లాగా చేసుకోండి. ముఖానికి చేతులకి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చింతపండు బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది.
ఇలా చేయడం వలన చర్మం పై పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోతాయి. డెడ్ స్కిల్స్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తుంది. చర్మాన్ని ఎంతో తాజాగా మారుస్తుంది చింతపండు రసాన్ని తీసుకొని కొంచెం టీ పొడి కోసం వేసుకోండి. ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని దూదిలో ముంచి ముఖానికి అప్లై చేసుకోవడం వలన నాచురల్ టోనర్ లాగ ఇది పనిచేస్తుంది. చింతపండు గుజ్జులో కొంచెం నిమ్మరసం వేసుకొని బేకింగ్ సోడా చెంచా పంచదార వేసుకొని మృదువుగా రాసుకోవాలి. తర్వాత క్లీన్ చేసేసుకోండి ఇలా చేయడం వలన మొటిమలు జిడ్డు చర్మం వంటి బాధలనుండి బయటపడొచ్చు.