చర్మ సౌందర్యాన్ని సంరక్షించి మొటిమలని దూరం పెట్టే అద్భుతమైన ఐదు ఆహారాలు..

-

డైట్ విషయానికి వస్తే అది తినాలని, ఇది తినకూడదని, దానివల్ల ఆ ఇబ్బందులు ఉంటాయని, వీటివల్ల ఈ ఇబ్బందులు దూరమవుతాయని చెబుతుంటారు. ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. చర్మానికి కూడా ఇది వర్తిస్తుందన్న చాలా మందికి తెలియదు. కొంత మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. మనం తినే ఆహారమే మన చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుందన్న విషయం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖంపై మొటిమలు ఏర్పడి ఇబ్బంది కరంగా ఉంటే మీకు ఈ ఐదు ఆహారాలు చాలా మేలు చేస్తాయి. అసలు మొటిమలు రాకుండా ఉండడానికి ఈ ఆహారాలు మీ దినచర్యలో భాగం చేసుకోవడం ఉత్తమం.

అవొకొడో

ఒమెగా 3కొవ్వులు అధికంగా గల అవోకోడోలు చర్మాన్ని తేమగా ఉంచడంలో బాగా సాయపడతాయి. అంతేగాక చర్మంపై వచ్చే ఇబ్బందులను దూరం చేస్తాయి.

నారింజ

సిట్రస్ ఫలమైన నారింజలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో బాగా సాయపడుతుంది. విష పదార్థాలు బయటకి వెళ్ళిపోతే ముఖంపై మొటిమలు ఏర్పడవు.

టమాట

నిజానికి ఆమ్ల తత్వాలు కలిగి ఉన్న టమాటని తీసుకోవడం వల్ల నల్ల మచ్చలు, మొటిమలు, దద్దుర్లుగా ఏర్పడడం మొదలైనవన్నీ దూరమవుతాయి. ఇందులో విటమిన్ ఏ, సి, కే అధికంగా ఉంటాయి. లైకోపీన్, కెరాటిన్ మొదలగునవి ఉండడం వల్ల చర్మానికి మేలు కలుగుతుంది.

బచ్చలి కూర

క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది కాబట్టి బచ్చలి కూర శరీరానికే కాదు చర్మానికి మేలైనది. దీనివల్ల రక్త ప్రసరణ పనితీరు మెరుగుపడి, శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి.

గింజలు

గింజల్లో మంచికొవ్వు ఉంటుంది. ఇది మిలమిలలాడే చర్మాన్ని అందిస్తుంది. సెలేనియం, విటమిన్ ఈ, ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది.

పై ఐదు ఆహారాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే ముఖంపై మొటిమలు రాకుండా అందంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news