పల్లెల్లో తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి.పుట్టిన ఊరులో వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదించవచ్చు..అందుకే ఈ మధ్య చాలా మంది చేస్తున్న ఉద్యొగాలను మానేసి చక్కగా పొలం పనులు చేసుకుంటూన్నారు.జాబ్లో వచ్చే శాలరీ కంటే.. ఇంకా ఎక్కువే ఆర్జిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య.. గ్రామీణ వాతావరణంలో.. హాయిగా బతుకుతున్నారు. ఐతే సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్తూ.. ఎంతో మంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు..అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరె లాభాలను పొందవచ్చు..
ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు కోత కోస్తారు.గడ్డి నుంచి సువాసన వస్తుందంటే.. అది కోతకు వచ్చిందని అర్థం చేసుకోవాలి.ఎండిన తర్వాత పొడి చేసి అమ్ముకోవచ్చు. లేదంటే నూనె తీసే యంత్నాన్ని కొనుగోలు చేసి.. నిమ్మగడ్డి నుంచి నూనె తీయవచ్చు..ఆ నూనెను మార్కెట్లో విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయి. ప్రస్తుతం ఒక లీటర్ నిమ్మగడ్డి నూనె ధర రూ.1000-1500 పలుకుతోంది..రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. ఒకసారి పంట వేస్తే.. ఆరేళ్ల వరకు మనం నిమ్మగడ్డిని కోయవచ్చు. ఏటా మూడు లేదా నాలుగు సార్లు పంట చేతికి వస్తుంది. ఒక్కో కోతకు 100 నుంచి 150 లీటర్ల నూనె వస్తుంది. మొత్తంగా ఒక సంవత్సర కాలంలో హెక్టారు పంట నుంచి 325 లీటర్ల మేర నిమ్మగడ్డి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఈ నూనెను మార్కెట్లో 1200-1500 విక్రయింవచ్చు.దాని ద్వారా 4 నుంచి 5 లక్షల లాభాన్ని పొందవచ్చు.. మంచి లాభాలు వస్తుండటంతో ఇప్పుడు చాలా మంది రైతులు ఈ పంట పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు ఈ బిజినెస్ పై ఇంట్రెస్ట్ వుంటే వ్యవసాయ నిపుణులు సలహా తీసుకొని పండించడం మేలు..