ఆర్జీవి సంచలన ట్విట్… ఓమెగా స్టార్ వైఎస్ జగన్ హీరోలను జీరోలుగా చేశారంటూ..

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్విట్లతో టాాలీవుడ్ స్టార్ హీరోలపై విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎం ముందు టాలీవుడ్ స్టార్ హీరోలంతా జీరో అయ్యారని సంచలన ట్విట్స్ చేశారు. వరస ట్విట్లతో సంచలనం రేపుతున్నాడు. వైఎస్ జగన్ నిజమైన ఓమెగా స్టార్ అని.. సూపర్ మెగా స్టార్లను వరసగా నిలబెట్టారని వ్యాఖ్యానించాడు. హీరోలంతా భిక్షాటన చేస్తూ.. దేవుడంటూ పొగిడారని తర్వాద ఓమెగా స్టార్ (జగన్) మాత్రమే నిజమైన స్టార్ అని నిరూపించుకున్నారని అన్నారు. దేవుడిని భక్తులు వేడుకున్నట్లుగా వేడుకున్నారని.. మన స్టార్లంతా ఓమెగా స్టార్ కు పట్టాభిషేకం చేశారంటూ వ్యంగ్యంగా స్పందించారు.

నేను ఓమెగా స్టార్ కు పెద్ద అభిమాని అయ్యానని.. స్టార్లందరి కన్నా తానే పెద్ద స్టార్ అని నిరూపించారని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి ఓమెగా స్టార్ ని ఓమెగా పవర్ స్టార్ గా పిలవాలనుకుంటున్నా సార్ అంటూ.. ట్విట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ సెన్సెషనల్ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news